- Advertisement -
అమరావతి: వేడి పాలు మీదపడడంతో ఓ బాలుడు ఊపిరాడక మృతి చెందాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా గుత్తిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కోటలోని పోస్టాఫీసు వద్ద ప్రతాప్‌రెడ్డి తన భార్యతో కలిసి ఉంటున్నాడు. 15 నెలల క్రితం ఈ దంపతులకు ఇద్దరు కవల పిల్లలు జన్మించారు. వారిలో శర్వీత్ రెడ్డికి పాలు తాగించాలని నిర్ణయం తీసుకున్నారు. పాలు బాగా చేసిన చల్లారడానికి గదిలో పెట్టి వెళ్లిపోయారు. శర్వీత్ పాక్కుంటూ వేడిపాల దగ్గరికి వెళ్లాడు. పాలు ముఖం మీదపడడంతో ఊపిరాడక అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. దీంతో కన్నతల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
- Advertisement -