- Advertisement -
హైదరాబాద్: బేగం బజార్ లో పురాతన భవనం కుప్పకూలిపోయింది. బేగం బజార్ లోని ఫీల్ ఖానా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ భవనం కూలిపోయినట్లు తెలుస్తోంది. శిథిలావస్థకు చేరుకుందని భవనాన్ని కూల్చేయాలని గతంలో జిహెచ్ఎంసి అధికారులు నోటీసులిచ్చిన ఆ భవనం అధికారులు పట్టించుకోలేదు. బేగం బజార్ లో పురాతన భవనాల్లోనే దుకాణాలు వ్యాపారులు కొనసాగిస్తున్నారు. ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉండడంతో శిథిలావస్థకు చేరిన భవనాలను కూల్చేయాలని స్థానికుల డిమాండ్ చేశారు. భవనం కూలిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కూలిన భవనం పక్కన ఉన్న ఇళ్ళను ఖాళీ చేయించి సహాయక చర్యలు చేపట్టారు.
- Advertisement -