Sunday, August 17, 2025

మన సంస్కృతిని తెలియజెప్పే సినిమా అందెల రవమిది

- Advertisement -
- Advertisement -

ఇంద్రాని దవులూరి ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా అందెల రవమిది. ఈ చిత్రాన్ని శివ భట్టిప్రోలు సమర్పణలో నాట్యమార్గం ప్రొడక్షన్స్ ఇంద్రాని దవులూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు ముందే డీసీ సౌత్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ డెబ్యూ ఫిలిం, ఇండియా ఇండిపెండెంట్ ఫిలిం ఫెస్టివల్‌లో బెస్ట్ ఉమెన్ మేడ్ ఫిలిం, గ్లోబల్ ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ డైరెక్టర్‌గా పలు పురస్కారాలు గెల్చుకోవడం విశేషం.

అందెల రవమిది సినిమా టీజర్‌ను ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ హరీశ్ శంకర్ మాట్లాడుతూ హద్దులు దాటుతున్న కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమాలు వస్తున్న ఈ ట్రెండ్ లో ఎలాంటి లాభాపేక్ష లేకుండా మన సంస్కృతిని తెలియజెప్పాలనే ప్రయత్నంతో అందెల రవమిది చిత్రాన్ని రూపొందించారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News