Wednesday, June 18, 2025

రామ్, ఉపేంద్రపై కీలక సన్నివేశాలు

- Advertisement -
- Advertisement -

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని యూనిక్ ఎంటర్‌టైనర్ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఈ మూవీలో పవర్ ఫుల్ రోల్ (Powerful roll) చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన సూపర్ స్టార్ సూర్యకుమార్ అనే పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని అల్యుమినియం ఫాక్టరీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో రామ్, ఉపేంద్ర పాల్గొంటున్నారు. కీలక టాకీ పార్ట్ షూట్ చేస్తున్నారు. రామ్, ఉపేంద్ర కాంబినేషన్‌లో వచ్చే ఈ సీన్స్ సినిమాలో మేజర్ హైలెట్‌గా ఉండబోతున్నాయి. ఈ చిత్రంలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్స్ కథానాయికగా నటిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News