Friday, May 16, 2025

వీరాభిమానిగా రామ్.. ట్రెండింగ్ లో ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ గ్లింప్స్

- Advertisement -
- Advertisement -

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న కొత్త చిత్రానికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది. రామ్ పుట్టినరోజు సందర్భంగా గురువారం ఆయన నటిస్తున్న మూవీ టైటిల్ ను రివీల్ చేస్తూ గ్లింప్స్ పంచుకున్నారు మేకర్స్. ఈ మూవీకి ‘ఆంధ్రా కింగ్ తాలుకా‘ అనే ట్రెండింగ్ టైటిల్ ను పెట్టారు.

ఈ సినిమాలో ఓ స్టార్ హీరోకు వీరాభిమానిగా నటిస్తున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది. ఈ వీడియో గ్లంప్స్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఇది యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ సినిమాను ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు తెరకెక్కిస్తున్నారు. పీరియాడికల్ లవ్ స్టోరీ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో రామ్ కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు. కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News