అమరావతి: డిగ్రీ విద్యార్థినిని చంపేసి అనంతరం మృతదేహాన్ని కాల్చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్రదుర్గంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హిరియూరు ప్రాంతం కోవేరహట్టికి చెందిన వర్షిత(19) బిఎ రెండో సంవత్సరం చదువుతోంది. హాస్టల్‌లో ఉంటూ డిగ్రీ చదువుతోంది. గోనూరు శివారులోని పొలంలోకి తీసుకెళ్లి ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు చంపేసి మృతదేహాన్ని తగలబెట్టారు. అదే సమయంలో వర్షం పడడంతో మృతదేహం సగం కాలిపోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. యువతి చేతికి ఉన్న టాటూ ఆధారంగా వర్షితగా గుర్తించారు. ప్రస్తుతం వర్షిత వెంట తిరుగుతున్న చేతన్ కుమార్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. వర్షితను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. వందలాది మంది విద్యార్థులు తరగతులను బహిష్కరించి పట్టణ వీధుల్లో నిరసనలు చేపట్టారు.
డిగ్రీ విద్యార్థినిని చంపేసి… తగలబెట్టారు… ఆమె పేరు బయటపెట్టిన వాన
- Advertisement -
- Advertisement -
- Advertisement -