Saturday, May 10, 2025

ఆంధ్రప్రదేశ్ జవాన్ వీరమరణం

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డంతండాకు చెందిన జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. జమ్ము కశ్మీర్ రాష్ట్రంలోని సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో మురళీ నాయక్ కన్నుమూశారు. మురళీ నాయక్ 2022లో అగ్నివీర్‌లో జవాన్‌గా చేరారు. పాక్-భారత్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు రోజుల క్రితం నాసిక్ నుంచి జమ్ము కశ్మీర్‌కు విధులు నిర్వహించేందుకు మురళీ నాయక్ పిలిపించారు. శుక్రవారం తెల్లవారుజామున పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో మురళీ నాయక్ వీరమరణం పొందారు. ఈ విషయంలో ఆర్మీ అధికారులు తల్లిదండ్రులకు చెప్పడంతో కుటుంబ సభ్యుల శోకసంద్రంలో మునిగిపోయారు. మురళీ నాయక్ తల్లిదండ్రులను సిఎం చంద్రబాబు నాయుడ పరామర్శించారు. మంత్రి కవిత గడ్డంతండాకు వెళ్లి జవాన్ తల్లిదండ్రులను పరామర్శించారు. ఎపి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చెక్కును మురళీ తల్లిదండ్రులకు అందజేశారు. జవాన్ మురళీ నాయకు మృతిపట్ల ఎపి సిఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News