Friday, July 18, 2025

అంతర్జాతీయ క్రికెట్‌కు రస్సెల్ రిటైర్మెంట్

- Advertisement -
- Advertisement -

వరుస ఓటములతో దిక్కుతోచని స్థితికి పడిపోయిన వెస్టిండీస్ క్రికెట్ టీమ్‌కు మరో షాక్ తగిలింది. వచ్చే ఏడాది టి20 వరల్డ్‌కప్ జరుగనున్న నేపథ్యంలో ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ గట్టి షాక్ ఇచ్చాడు. రస్సెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. జులై 22న ఆస్ట్రేలియాతో జరిగే రెండో టి20 తర్వాత రస్సెల్ ఆటకు వీడ్కోలు పలకనున్నాడు. ఈ విషయాన్ని రస్సెల్ గురువారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. రస్సెల్ విండీస్ తరఫున 84 టి20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ క్రమంలో 1,078 పరుగులు చేశాడు. దీంతో పాటు 61 వికెట్లను కూడా పడగొట్టాడు. అంతేగాక 56 వన్డేల్లో విండీస్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 1,034పరుగులతో పాటు 70 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. కొన్ని రోజుల క్రితమే నికోలస్ పూరన్ కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News