శ్రీలంక స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ ఏంజిలో మ్యాథ్యూస్ (Angelo Mathews).. టెస్ట్ క్రికెట్‌కి (Test Cricket) రిటైర్‌మెంట్ ప్రకటించారు. బంగ్లాదేశ్‌తో గాలే వేదికగా జూన్ 17న జరిగే తొలి టెస్ట్ అనంతరం తాను టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు. అయితే వైట్‌బాల్ క్రికెట్‌కి మాత్రం అందుబాటులో ఉంటానని తెలిపారు. యంగ్ టాలెంట్‌కి అవకాశం ఇవ్వాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
17 సంవత్సరాలు శ్రీలంక జట్టుకు ప్రాతినిధ్యం వహించడం తనకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తానని అన్నారు. తన కెరీర్‌లో అండగా నిలిచిన శ్రీలంక క్రికెట్‌కు, తోటి ఆటగాళ్లకు, అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 2009లో ఆస్ట్రేలియాపై జరిగిన టెస్ట్‌లో ఆరంగేట్రం చేసిన మ్యాథ్యూస్ (Angelo Mathews) తన కెరీర్‌లో 118 టెస్టులు (Test Cricket) ఆడారు. 44 సగటుతో 8167 పరుగులు చేశారు. 34 టెస్టుల్లో శ్రీలంక జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. 2024లో టి-20 ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాథ్యూస్ చివరగా ఆడారు.