Sunday, May 4, 2025

అంగోలా భద్రతకు మాది భరోసా

- Advertisement -
- Advertisement -

ప్రధాని మోడీ జోనో మధ్య విస్తృత చర్చలు
200 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం
ఉగ్రదాడుల నివారణకు ఉపయుక్తం

న్యూఢిల్లీ : అంగోలా అధ్యక్షులు జోవో మాన్యువెల్ గన్‌కాల్వేస్ శనివారం భారతదేశ పర్యటనకు వచ్చారు. అధికారిక లాంఛనాలతో స్వాగతం , అధికారుల స్థాయిలో చర్చల అనంతరం స్థానిక హైదరాబాద్ హౌజ్‌లో ఇద్దరు నేతలు కలిసి మీడియాతో మాట్లాడారు. అంగోలాతో 200 మిలియన్ డాలర్ల వ్యయంతో కూడిన రక్షణ సాయానికి భారతదేశం నిర్ణయించినట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఇది డిఫెన్స్ క్రెడిట్‌గా ఉంటుందని వెల్లడించారు. ఉగ్రవాదం అంతర్జాతీయ సవాళ్లను పెంచుతోంది. వీటిని నిర్థిష్టంగా తిప్పికొట్టాల్సి ఉంది. ఉగ్రవాదం అణచివేతకు సాగుతున్న పోరులో అంగోలా కూడా స్థిరమైన ధైర్యంతో సాయం అందించాల్సి ఉంటుంది.

ఉగ్రవాదులు వారి వెనుక ఉన్న వారి మూలాలను పెరికివేయాల్సి ఉందని ప్రధాని మోడీ పిలుపు నిచ్చారు. ఇటీవలే పహల్గాం ఉగ్రదాడిలో అమాయక పౌరులు టూరిస్టులుగా వచ్చిన దశలో ఉగ్రపంజాకు బలి అయ్యారు. ఈ విషయాన్ని అంగోలా నేతకుప్రధాని మోడీ సూచనప్రాయంగా తెలిపారు. అంగలా ప్రధాని ఇక్కడికి రావడం వల్ల ద్వెపాక్షిక సంబంధాలు మరింత పటిష్టం అవుతాయి. అంతేకాకుండా ఇండో ఆఫ్రికా భాగస్వామ్యం దిశలో ఈ స్నేహం ఎంతగానో ఉపకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంగోలాకు 200 డాలర్ల ఆర్థిక సాయం అందిస్తున్న విషయాన్ని ఈ దశలో తెలియచేస్తున్నానని చెప్పారు. అంగోలా రక్షణ బలగాల బలోపేతం , ఆధునీకరణకు ఈ సొమ్ము ఉపయోగపడుతుందని ఆశిస్తున్నామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News