అమరావతి: అక్రమ అరెస్టులతో కూటమి నేతలు శునకానందం పొందుతున్నారని వైసిపి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) తెలిపారు. మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..2014- 2019లో ఎపి సిఎం చంద్రబాబు నాయుడు లిక్కర్ స్కామ్ చేశారని, చంద్రబాబు హయాం లోనే కొత్త మద్యం బ్రాండ్లు వచ్చాయని విమర్శించారు. వైసిపి హయాంలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో పారదర్శకంగా మద్యం అమ్మకాలు జరిగాయని తెలియజేశారు. తమ ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు (Government liquor sales) తగ్గి ఆదాయం పెరిగిందని, చంద్రబాబు హయాంలో మద్యం అమ్మకాలు పెరిగి ఆదాయం తగ్గిందని ఎద్దేవా చేశారు. మద్యం అమ్మకాలు పెరిగితేనే ముడుపులిస్తారని, బాబుపై ఉన్న కేసులను మాఫీ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ పై అక్కసుతోనే నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని అనిల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాబుపై ఉన్న కేసులను మాఫీ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు: అనిల్
- Advertisement -
- Advertisement -
- Advertisement -