ఇంగ్లండ్‌తో లార్డ్స్ మైదానంలో వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. స్టార్ పేసర్లు వికెట్లు తీసేందుకు ఇబ్బంది పడుతున్న సమయంలో ఓపెనర్లు ఇద్దరిని ఔట్ చేసి ఇంగ్లండ్‌కు షాక్ ఇచ్చాడు. ఈ సందర్భంగా నితీశ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే.. నితీశ్‌ని పొగడ్తలతో ముంచెత్తారు. నితీశ్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని ఆయన అన్నారు.
‘‘లార్డ్స్‌లో తొలి రోజు నితీశ్ (Nitish Kumar Reddy) బౌలింగ్ చూసి సర్‌ప్రైజ్ అయ్యాను. నిలకడగా.. సరైన ప్రాంతంలో బౌలింగ్ చేశాడు. తొలి వికెట్ గిఫ్ట్‌గా అనిపించినా.. రెండో వికెట్‌ను సూపర్ డెలివరితో రాబట్టాడు. జాక్ క్రాలీని చక్కటి బంతితో పెవిలియన్ చేర్చాడు. నితీశ్ ఫిట్‌నెస్ సూపర్. తొలి రోజు 14 ఓవర్లు వేశాడు. ఇంకా వేయగలడు. కుర్రాడు కావడంతో నియంత్రణతో బౌలింగ్ చేశాడు. ఆసీస్ సిరీస్‌లో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ సిరీస్‌లో ఎక్కువ వికెట్లు తీయకపోయినా.. భాగస్వామ్యాలను విడదీసేలా బౌలింగ్ చేసే సత్తా ఉందని నిరూపించుకున్నాడు. ఫీల్డింగ్‌లోనూ చురుగ్గా ఉంటాడు. అందుకే అతనిపై వేటు వేయడం, పక్కన పెట్టడం వంటివి చేయద్దు ఇంకా అవకాశాలు ఇవ్వాలి’’ అని కుంబ్లే అన్నారు.