- Advertisement -
అమరావతి: వైసిపి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నాం అని ఎపి హోం మంత్రి వంగలపూడి అనిత (Anitha Vangalapudi) తెలిపారు. తమ తల్లి, చెల్లి గురించి భయపెట్టే వ్యాఖ్యలు చేసినా వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి స్పందించలేదని అన్నారు. ఈ సందర్భంగా అనిత మీడియాతో మాట్లాడుతూ..ప్రసన్న కుమార్ వ్యాఖ్యలను కోర్టులు సైతం తప్పుపట్టాయని చెప్పారు. ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను జగన్ సమర్థిస్తున్నారా? (defending Jagan)అని పరామర్శకు వెళ్లారా? బల ప్రదర్శనకు వెళ్లారా? అని ప్రశ్నించారు. ఎక్కడికి వెళ్లినా బల ప్రదర్శనే చేస్తున్నారని, వైసిపి హయాంలో మహిళపై భయాన్ని కలిగించే మాటలు చెప్తే జగన్ స్పందించలేదని విమర్శించారు. అధికారం పోయిన జగన్ అదే ధోరణిలో ఉన్నారని పరామర్శల పేరుతో నీచ రాజకీయాలు చేస్తున్నారని అనిత దుయ్యబట్టారు.
- Advertisement -