- Advertisement -
అహ్మదాబాద్ విమాన ప్రమాదం జ రిగిన కొన్ని రోజులకే ఢిల్లీ నుంచి వియన్నా వెళ్లే ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే ఆకాశంలో 900 అడుగుల మేర కు పడిపోయింది. దర్యాప్తు ఫలితం వచ్చే వర కు ఆ విమానం తాలూకు ఇద్దరు పైలట్లను వి ధులకు దూరం పెట్టినట్లు ఎయిర్‌లైన్ ప్రతినిధి మంగళవారం తెలిపారు. ఫ్లయిట్ ఏఐ 187, బోయింగ్ 777 విమానం జూన్ 14న తెల్లవారు జామున 2.56 గంటలకు ఇందిరా గాం ధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాలు ప్రయాణించి చివరికి వియన్నాలో సురక్షితంగా దిగింది. కానీ టేకాఫ్ తర్వాత తీసుకున్నప్పుడు విమానం అకస్మత్తుగా ఎత్తును(ఆల్టిట్యూడ్) పట్టును కోల్పోయింది. దాంతో స్టాల్, గ్రౌండ్ సామీప్యత హెచ్చరికలు అందాయి. వాటిలో ‘డోన్ట్ సింక్’ హెచ్చరికలు కూడా ఉన్నాయని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పేర్కొంది.
- Advertisement -