- Advertisement -
హైదరాబాద్ సిటీలో మరో అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఓ భవనం రెండో అంతస్తులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగసిపడుతుండటంతో దట్టంగా పొగ కమ్ముకుంది. మంటలు చెలరేగడంతో భవనంలోని నివాసితులు వెంటనే కిందకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. కాగా, రెండు రోజుల క్రితం పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబంలోని 17మంది ప్రాణాలు కోల్పోయారు.
- Advertisement -