సినిమా బండి ఫేమ్ డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల ’పరదా’ (paradha)అనే మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ తో వస్తున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ మేకర్స్ రాజ్, డికె మద్దతు ఇస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా, దర్శన రాజేంద్రన్‌తో పాటు, సంగీత ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాగ్ మయూర్ ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘పరదా’ ఆగస్ట్ 22న థియేటర్స్‌లో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ “చిరంజీవి బర్త్‌డే ఆగస్టు 22న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది.
దర్శన ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసింది. ఒక తెలుగు అమ్మాయిలాగే డైలాగ్స్ అన్నీ నేర్చుకుంది. సంగీత ఈ సినిమాకి మరో బిగ్ పిల్లర్. (Big Pillar) నా కెరీర్ లోనే బెస్ట్ ఫిలిం పరదా”అని అన్నారు. డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల మాట్లాడుతూ “పరదా చాలా మంచి ఫిలిం. తెలుగులో ఉమెన్ సెంట్రిక్ ఫిలిమ్స్ చాలా తక్కువగా వస్తాయి . ఈ సినిమా సక్సెస్ అయితే ఇలాంటి మరెన్నో సినిమాలు వస్తా యి. అనుపమ కూడా పెద్ద స్టార్. అందరూ కూడా ఫ్యామిలీతో కలిసి వెళ్లి ఈ సినిమా చూడండి”అని పేర్కొన్నారు. ప్రొడ్యూసర్ విజయ్ మాట్లాడుతూ “ఈ సినిమాతో అనుపమకి పెద్ద హిట్ ఇద్దాం. ఈ సినిమా కం టెంట్ అందరికీ నచ్చుతుంది”అని తెలిపా రు. ఈ కార్యక్రమంలో దర్శన రాజేంద్రన్, ప్రొడ్యూసర్ శ్రీధర్, రాగ్ మయూర్ తదితరులు పాల్గొన్నారు.