ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీం ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) మంచి ప్రదర్శన చేస్తున్నాడు. ముఖ్యంగా లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో జట్టును గెలిపించేందుకు ఆఖరి వరకూ కృషి చేశాడు. కానీ, విజయం మాత్రం ఇంగ్లండ్‌ను వరించింది. అయితే ఇఫ్పుడు మాంచెస్టర్ వేదికగా జరుగుతున్ నాలుగో టెస్ట్‌లో తొలి రోజే బ్యాటింగ్‌కి వచ్చిన జడేజా.. తనదైన శైలీలో ఇంగ్లండ్ బౌలర్లను ఎదురుకుంటూ పరుగులు రాబడుతున్నాడు. ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డు జడేజాను ఊరిస్తోంది.
ఈ మ్యాచ్‌లో జడేజా (Ravindra Jadeja) మరో 12 పరుగులు చేస్తే.. ఇంగ్లండ్ గడ్డపై 1000+ పరుగులు, 30+ వికెట్లు సాధించిన తొలి భారత ఆటగాడిగా జడేజా రికార్డు సృష్టిస్తాడు. ఓవరాల్‌గా చూస్తే.. ఈ రికార్డును కేవలం వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ గ్యారీ సోబర్స్ పేరిట ఉంది. అతడు 21 టెస్టుల్లో 1,820 పరుగులు, 30 వికెట్లు పడగొట్టాడు. జడేజా ప్రస్తుతం 988 పరుగులు చేసి ఇప్పటికే 30 వికెట్లు తీశాడు. దీంతో ఈ అరుదైన రికార్డును సాధించేందుకు జడేజాకు మరో 12 పరుగుల అవసరం ఉంది.
కాగా, నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కి దిగిన భారత్ తొలి రోజు ఆచితూచి బ్యాటింగ్ చేసింది. భారత బ్యాటింగ్‌లో సాయి సుదర్శన్ 61, యశస్వీ జైసాల్ 58, కెఎల్ రాహుల్ 46 పరుగులు చేశారు. 37 పరుగులు చేసిన రిషబ్ పంత్ రిైటైర్ హార్ట్ అయ్యాడు. తొలి రోజు ఆట ముగిసే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలింగ్‌లో స్టోక్స్ , డ్వాసన్, వోక్స్ తలో వికెట్ తీశారు.