మన తెలంగాణ/హైదరాబాద్ : పుప్పాలగూడ భూములపై ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ్మినేని ఫిర్యాదును లోకాయుక్త విచారణకు స్వీక రించింది. దీనిపై విచారణ జరిపి సెప్టెంబర్ 28వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని హెచ్‌ఎండిఎ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్‌ను లోకా యుక్త జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ అ నుమతులు, చోటు చేసుకున్న అక్రమాలపై ద ర్యాప్తు నివనేదిక ఇవ్వా లం టూ ఆదేశాలు జా రీ చేసింది. పుప్పాలగూడ సర్వే నెంబర్ 277, 340, 341కు సంబంధించి భారీ కుంభకోణం జరిగిందని, ఈ విషయంలో విచార ణ జరిపి చర్యలు తీసుకోవాలని న్యాయవాది రామారా వు ఇమ్మినేని లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా మాజీ హెచ్‌ఎండిఎ మెట్రో పాలిటన్ కమిషనర్ అరవింద్ కుమార్, మాజీ ఎంపి రంజిత్‌రెడ్డి తనయుడు రాజ్ ఆర్యన్‌రెడ్డి, డైరెక్టర్‌గా ఉన్న వెస్ట్రన్ విండర్స్ పార్క్ ఎల్‌ఎల్‌పి సంస్థ, మాజీ హెచ్‌ఎండిఎ మెట్రో పాలిటన్ డైరెక్టర్ శివబాలకృష్ణను విచారిస్తే అక్రమాలు వెలుగుచూస్తాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. రామారావు ఇమ్మినేని చేసిన ఫిర్యాదును లోకాయుక్త విచారణకు స్వీకరించింది.
ఐఎఎస్ అరవింద్‌కుమార్‌కు మరో షాక్
- Advertisement -
- Advertisement -
- Advertisement -