Thursday, September 4, 2025

శీలావతి నా కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోతుంది: అనుష్క శెట్టి

- Advertisement -
- Advertisement -

క్వీన్ అనుష్క శెట్టి నటించిన యాక్షన్ డ్రామా ఘాటీ. విక్రమ్ ప్రభు మేల్ లీడ్ గా నటించిన ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. యువి క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో క్వీన్ అనుష్క శెట్టి మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు…
ఘాటీ సినిమాలో నేను చేసిన శీలావతి చాలా మంచి పాత్ర. ఇలాంటి క్యారెక్టర్‌ని నేను గతంలో ఎప్పుడూ చేయలేదు. చాలా బ్యూటిఫుల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్. కంఫర్ట్ జోన్‌ని దాటి చేసిన సినిమా ఇది.
డిఫరెంట్ షేడ్‌తో…
-అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి, భాగమతి.. ఈ సినిమాలన్నిటిలోనూ చాలా బలమైన పాత్రలు చేశాను. ఘాటీలో చేసిన శీలావతి క్యారెక్టర్ కూడా అంత బలంగా ఉంటూనే ఒక డిఫరెంట్ షేడ్‌తో ఉంటుంది. శీలావతి పాత్ర నా కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోతుంది.

అలాంటి బలమైన పాత్ర…
-ప్రతి మహిళ సాధారణంగా, సున్నితంగా కనిపించినప్పటికీ ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు ఒక బలమైన పిల్లర్‌లాగా నిలబడతారు. మహిళలో ఉండే గొప్ప లక్షణం అది. క్రిష్ అలాంటి ఒక బలమైన పాత్రని తీర్చిదిద్దారు.
చాలా ఆసక్తికరంగా అనిపించింది…
-క్రిష్, రచయిత శ్రీనివాస్ ఈ కథ చెప్పినప్పుడు ఆ సంస్కృతి చాలా ఆసక్తికరంగా అనిపించింది. లొకేషన్స్‌కి వెళ్ళిన తర్వాత ఒక కొత్త పాత్ర, సంస్కృతి, ఒక కొత్త విజువల్‌ని ఆడియన్స్‌కి చూపించబోతున్నామనే ఉత్సాహం కలిగింది.

కథలోనే చక్కని సందేశం…
-క్రిష్ ఎప్పుడు కూడా సమాజానికి సంబంధించిన కథలనే ఎంచుకుంటారు. సమాజంలో ఉండే సీరియస్ సమస్య గంజాయి. మేము ఈ సినిమాని యాక్షన్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గానే తీశాం. అయితే ఈ కథలోనే చక్కని సందేశం కూడా ఉంది. అది చాలా పాజిటివ్‌గా ఉంటుంది.
అద్భుతమైన పాత్రలు ఇస్తున్నారు…
వేదం సినిమా తర్వాత క్రిష్‌తో కలిసి చేస్తున్న సినిమా ఇది. -వేదంలో సరోజ పాత్రకి కొనసాగింపుగా ఒక సినిమా చేద్దాం అనుకున్నాం. అలాంటి సమయంలో ఘాటి లాంటి అద్భుతమైన కథ కుదిరింది. క్రిష్ నాకు ఎప్పుడు కూడా చాలా అద్భుతమైన పాత్రలు ఇస్తున్నారు. ఈ విషయంలో ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇందులో శీలావతి క్యారెక్టర్ నా ఫిల్మోగ్రఫీలో ఎప్పటికీ నిలిచిపోతుంది.

తదుపరి చిత్రాలు…
మలయాళంలో ఓ సినిమా చేస్తున్నాను. అది నా తొలి మలయాళం ఫిల్మ్. తెలుగులో కొత్త సినిమా ప్రకటన ఉంటుంది. ఆ సినిమా కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. -నాకు అవుట్ అండ్ అవుట్ నెగిటివ్ క్యారెక్టర్ చేయాలని ఉంది. ఒక బలమైన క్యారెక్టర్ కుదిరితే కచ్చితంగా నెగిటివ్ రోల్ చేస్తాను.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News