Saturday, May 3, 2025

మూడేళ్లలో అమరావతిని పూర్తి చేస్తాం: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని పూర్తి చేస్తామని ముఖ్వమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. శుక్రవారం అమరావతి పునఃప్రారంభ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. రూ.57,980 కోట్ల ప్రాజెక్టులకు ఇవాళ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయని.. మోడీ గైడెన్స్‌తో అమరావతిని ప్రపంచం మెచ్చే రాజధానిగా తయారు చేస్తామని చెప్పారు. మూడేళ్లలో అమరావతిని పూర్తి చేస్తామని.. అప్పుడు ప్రధాని మోడీని మళ్లీ ఆహ్వానిస్తామన్నారు. “2024 ఎన్నికల్లో నేను, పవన్ కళ్యాణ్ కలిసి పని చేసి 94 శాతం స్ట్రైక్ రేట్ సాధించాం. ఇప్పుడు కేంద్రం ఇచ్చిన ఆసరాతో ఎపి అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది. కేంద్రం సహకారంతో అమరావతిని మళ్లీ పట్టాలెక్కిస్తున్నాం. 34 వేల ఎకరాల భూమిని రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారు. అమరావతి రైతులు వీరోచితంగా పోరాడారు.. ఇది వాళ్ల విజయం. అమరావతి రైతులు చేసిన ఉద్యమం లాంటి ఉద్యమాన్ని ఇంత వరకు నేను ఎప్పుడూ చూడలేదు” సిఎం పేర్కొన్నారు.

అమరావతి 5 కోట్ల మంది ప్రజల సెంటిమెంట్ అని.. 5 లక్షల మంది ఇక్కడ చదువుకునే అవకాశం ఉంటుందన్నారు. అమరావతిని హెల్త్, ఎడ్యుకేషనల్ హబ్‌గా చేస్తామని సిఎం చెప్పారు. పర్యావరణహితంగా అమరావతిని తయారు చేస్తామని.. బిట్స్ పిలానీ, టాటా ఇన్నోవేషన్ హాబ్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఇక్కడికి వస్తాయని చంద్రబాబు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News