Sunday, July 20, 2025

తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయం: ఈటల రాజేందర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావును, తాను ఎందుకు కలుస్తామని బిజెపి ఎంపి ఈటల రాజేందర్ (Etala Rajender) అన్నారు. మూడు తరాల ఉద్యమంలో అసువులు బాసిన అమరులకు నివాళులర్పించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ విచారణ ఎక్కడికి పోయిందని, ఒక్క అవినీతి, అక్రమాలపైనైనా చర్యలు తీసుకున్నారా?నని ప్రశ్నించారు. ఎపి అద్భుతంగా అభివృద్ధి చెందుతుంటే.. తెలంగాణ వెలవెలబోతుందని ఎద్దేవా చేశారు. సిఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఢిల్లీకి వెళ్లి ప్రధానిని పెద్దన్నఅంటారని, గల్లీకీ వచ్చి విమర్శిస్తారని అన్నారు. తెలంగాణ ప్రజల ఆశలను బిఆర్ఎస్, కాంగ్రెస్ కల్లలు చేసిందని దుయ్యబట్టారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించడం తథ్యం అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News