టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ యాక్ట్ చేసిన తాజా చిత్రం ‘కింగ్‌డమ్’ (Kingdom). ఓ విభిన్నమైన కథాంథంతో ఈ సినిమాను రూపొందించారు. అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 31న విడుదల కానుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కింగ్‌డమ్ చిత్ర యూనిట్‌కు శుభవార్త అందించింది. ఈ సినిమాకు టికెట్ ధరలు పెంచుకొనేందుకు అనుమతి ఇచ్చింది. సినిమా విడుదల తేదీ నుంచి పది రోజుల వరకూ పెంచిన ధరలు అమలో ఉండనున్నాయి. దీంతో సింగిల్ స్క్రిన్ థియేటర్లలో టికెట్లు .రూ50 (జిఎస్‌టితో కలిపి), మల్టీప్లెక్స్‌ల్లో రూ.75 (జిఎస్‌టితో కలిపి) ధరలు పెంచుకునేందుకు వీలు కల్పించారు. దీంతో పాటు ఒక రోజు ముందుగా ప్రీమియర్ షోలకు అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో (Kingdom) భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో గూఢచారి పాత్రలో కనిపిస్తుండగా.. ఆయన సోదరుడి పాత్రలో సత్యదేవ్ కనిపించనున్నారు. ఇప్పటికే టీజర్, పాటలతో సినిమాపై అంచనాలను పెంచేసింది. చిత్ర యూనిట్. ఈ నెల 26వ తేదీన సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. అదే రోజున తిరుపతిలో వేడుక నిర్వహించనున్నారు.