- Advertisement -
అమరావతి: రతన్ టాటా ఆలోచనలు సజీవంగా ఉంచాలనే ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేశామని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తెలిపారు. ప్రతి కుటుంబం నుంచి ఎంట్రప్రెన్యూర్ రావాలనేదే తన ఉద్దేశమని అన్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు ఎపి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇన్నోవేషన్ హబ్ ను చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంగళగిరిలో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ..గతంలో ప్రతి ఇంటి నుంచి ఒక ఐటి ఉద్యోగి (IT employee) ఉండాలని కృషి చేశానని, సమాజ సేవకు రతన్ టాటా జీవితాంతం కృషి చేశారని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలనే చూస్తారని, రతన్ టాటా మాత్రం సంపాదించిన డబ్బును సమాజానికి తిరిగిచ్చేవారని చంద్రబాబు పేర్కొన్నారు.
- Advertisement -