ఎపి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌కు హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. సినిమా ప్రమోషన్‌లో ప్రభుత్వ నిధులు, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని, మంత్రిగా ఉంటూ సినిమాల్లో నటిస్తున్నారని ఆరోపిస్తూ మాజీ ఐఎఎస్ అధికారి విజయ్ కుమార్ గత నెల19వ తేదీన పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ వాహనాలు, భద్రతా సిబ్బందిని సినిమా కార్యక్రమాలకు ఉపయోగించారని పిటిషన్‌లో వెల్లడించారు. దీనిపై హైకోర్టు సోమవారం విచారణ జరపనుంది. ఇదిలా ఉండగా ఈ విషయంపై గత నెలలో హైకోర్టు ముందుకు వచ్చిన విచారణలో రాష్ట్ర హోంశాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది జయంతి స్పందించారు. ఉప ముఖ్యమంత్రి వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యాజ్యం పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ జోతిర్మయి ప్రతాప సిబిఐ, ఎసిబి తరపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పేర్లను కేసుల విచారణ జాబితాలో పేర్కొనకపోవడాన్ని తప్పుపట్టారు. వారి పేర్లను చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసిన సంగతి విదితమే.
ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్‌కు హైకోర్టులో బిగ్ షాక్
- Advertisement -
- Advertisement -
- Advertisement -