ముంబై: భారత క్రికెట్ జట్టుకు (Team India) కొత్త జెర్సీ స్పాన్సర్ దొరికేసింది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆన్లైన్ గేమింగ్ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో డ్రీమ్ 11 భారత జట్టు జెర్సీ స్పాన్సర్‌గా ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో కొత్త స్పాస్సర్ లేకుండానే టీం ఇండియా ఆసియాకప్ బరిలోకి దిగింది. తాజాగా కొత్త స్పాన్సర్ కోసం బిసిసిఐ అభ్యర్థనలు స్వీకరించింది.
ఇందులో అపోలో టైర్స్ సంస్థ స్పాన్సర్‌షిప్‌ను దక్కించుకుంది. స్పాన్సర్షిప్ కోసం కాన్వా, జెకె టైర్ సంస్థలు పోటీ పడ్డాయి. కానీ చివరికి ఆ హక్కులు అపోలో టైర్స్‌కు దక్కాయి. 2027 వరకూ భారత్ (Team India) ఆడే మ్యాచ్‌లకు అపోలో టైర్స్ సంస్థ జెర్సీ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ బిసిసిఐకి మ్యాచ్‌కు రూ.4.5 కోట్లు చెల్లించనుంది. గతంలో డ్రీమ్ 11 సంస్థ రూ.4 కోట్లు చెల్లించేది. దీంతో భారత క్రికెట్లో ఇటీవల కాలంలో అత్యంత లాభదాయకమైన స్పాన్సర్షిప్ ఒప్పందాల్లో ఇది ఒకటిగా నిలిచింది.
Also Read : ఆసియా కప్ 2025: యుఎఇకి తొలి విజయం