అర్జున్ చక్రవర్తి’ని విజువ ల్ ట్రీట్‌గా తెరకెక్కించిన కెమెరామెన్ జగదీష్ చీకటి పనితనం గురించి ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ చిత్రానికిగానూ ఎన్నో అంతర్జాతీయ వేడుకల్లో బెస్ట్ సినిమాటోగ్రాఫర్‌గా ఆయన అవార్డుల్ని అందుకున్నారు. ఈ సందర్భంగా జగదీష్ చీకటి మీడియాతో మాట్లాడుతూ “హాలీవుడ్ స్థాయి కి ధీటుగా మనం సినిమాలు తీస్తున్నాం. మా ‘అర్జున్ చక్రవర్తి’ కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఆ స్థాయి లుక్ వచ్చేందుకు నేచురల్ లైటింగ్‌లోనే షూటింగ్ చేశాం. ఇక ‘అర్జున్ చక్రవర్తి’ షూటింగ్ కోసం మంచు కురిసే ప్రాంతం కదా అని కాశ్మీర్ కు వెళ్లాం.
కానీ మేం వెళ్లినప్పుడు అక్కడ మంచు పడటం లేదు. దీంతో అక్కడే మంచు కురిసే వరకు ఎదురుచూశాం. అలా చివరకు మైనస్ 8 డిగ్రీల వరకు వెళ్లింది. దీంతో విజువల్స్ అద్భుతంగా వచ్చాయి. క్లైమాక్స్ ఎపిసోడ్‌కి చాలా కష్టపడాల్సి వచ్చింది. ‘అర్జున చక్రవర్తి’కి గానూ అంతర్జాతీయ స్థాయిలో నాకు నాలుగు అవార్డులు, కోలీవుడ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, కేరవ్యాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, మోకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ది బుద్దా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు వచ్చాయి”అని అన్నారు.
Also Read : యూనిక్ యాక్షన్ థ్రిల్లర్