హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఇంటి వాడు కాబోతున్నట్టు సమాచారం. సచిన్ ఇళ్లు కొద్ది రోజుల పెళ్లి సందడిగా మారనుంది. సానియా చందోక్ అనే యువతితో అర్జున్ నిశ్చితార్థం చేసుకున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలోనే నిశ్చితార్థం జరిగినట్టు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముంబయికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలే సానియా చందోక్ అని తెలుస్తుంది. మిస్టర్ పాస్ స్పా, స్టోర్ భాగస్వామిగా, డైరెక్టర్‌గా సానియా పని చేస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యుకలు హోటల్స్, ఐస్‌క్రీమ్ బ్రాండ్ బ్రూక్లిన్‌తో పాతు క్రీమరీతో పాటు పలు పాల వ్యాపారాలు ఉన్నట్టు సమాచారం. ఆల్‌రౌండర్‌గా టీమిండియా జట్టులోకి వచ్చేందుకు అర్జున్ చాలా శ్రమిస్తున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో గోవా తరపున ఆడుతున్నాడు. ఇప్పటివరకు అర్జున్ 17 17 ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 37 వికెట్లు తీయడంతో పాటు 532 పరుగులు చేశాడు. 24 టి20 మ్యాచుల్లో 27 వికెట్లు తీసి 119 పరుగులు చేశాడు. ఐపిఎల్ వేలంలో ముంబయి ఇండియన్స్ అతడిని తీసుకున్న విషయం తెలిసిందే.
సచిన్ ఇంట్లో పెళ్లి బాజాలు?… అర్జున్ కు నిశ్చితార్థం
- Advertisement -
- Advertisement -
- Advertisement -