క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) క్రికెట్‌లో అంతగా పేరు సంపాదించలేకపోయాడు. ఇప్పటికీ సచిన్ కుమారుడిగానే అతన్ని చూస్తున్నారు. కానీ, తనకంటే సొంత గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. అయితే తనకు దొరికి అవకాశాలను మాత్రం సద్వినియోగం చేసుకుంటున్నాడు అర్జున్. మరోవైపు ఇటీవల అర్జున్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలినే అతడు వివాహం చేసుకోనున్నాడు. అయితే ఏడు నెలల విరామం తర్వాత తిరిగి మైదానంలోకి అడుగుపెట్టిన అతడు.. తొలి మ్యాచ్‌లోనే చెలరేగిపోయాడు. ఐదు వికెట్ల ప్రదర్శనతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు.
కర్ణాటక క్రికెట్ సంఘం ఆధ్వర్యం డాక్టర్ కె.తిమ్మప్పయ్య మెమోరియల్ టోర్నమెంట్ జరుగుతోంది. ఈ టోర్నీలో అర్జున్ (Arjun Tendulkar) గోవా తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇందులో భాగంగా మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో అతడు చెలరేగిపోయాడు. తొలి బంతికే వికెట్ తీసిన అర్జున్.. మొత్తం ఐదు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఫలితంగా మహారాష్ట్ర జట్టు 136 పరుగులకే ఆలౌట్ అయింది. బౌలింగ్‌తో పాటు అర్జున్ బ్యాటింగ్‌లోనూ మంచి ప్రదర్శన చేశాడు. గోవా ఇన్నింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన అర్జున్ 44 బంతుల్లో 36 పరుగులు చేశాడు. దీంతో గోవా తొలి ఇన్నింగ్స్‌లో 333 పరుగులు చేసింది. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో మహారాష్ట్ర 127/2 స్కోర్‌తో ఆడుతోంది.
Also Read : ఆసియా కప్ 2025.. నేడు ఒమన్‌తో పాక్ తొలి పోరు