Friday, May 23, 2025

ఆర్మూర్‌లో రైతుల మహాధర్నా

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన వరి పంటను కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు పంటను అరబెట్టి కల్లాల వద్ద రాత్రింబవళ్లు కావలి ఉండి కొంత ధాన్యాన్ని సంచులు కొన్ని నింపి, సంచులు హమాలీలా కొరత వల్ల కుప్పలు పోసి లారీల కొరకు ఎదురు చూస్తుంటూ, భగవంతుడు రైతులకు సహకరించక అకాల వర్షంతో రైతులను ఆగమాగం చేశాడు. ప్రభుత్వం సొసైటీ మెప్మా మహిళా సంఘం, మార్కెటింగ్ ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద వర్షాల వల్ల గడిసిన వరి ధాన్యం, మొలకలు మొలిచిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలో గల కెనాల్ బ్రిడ్జి వద్ద మండల రైతులు గురువారం మహాధర్నా నిర్వహించారు. అకాల వర్షం వల్ల వరి ధాన్యంలో మొలకలు మొలిచిన ధాన్యాన్ని తీసుకువచ్చి రోడ్డుపై బైఠాయించారు.

కలెక్టర్ మార్కెట్ కమిటీ అధికారులు వచ్చే వరకు రోడ్డుపై ధర్నా చేస్తామని రైతులు భీష్మించుకొని కూర్చున్నారు. వందలాది వాహనాలు ఎక్కడికంటే నిలిచి రవాణా సౌకర్యానికి ఇబ్బందుల మారాయి. జిల్లా అధికారులకు అకాల వర్షాలు ఉన్నాయన్న సమాచారం ఉన్న వరి ధాన్యం కేంద్రాల వద్ద ఎందుకు నిర్లక్షం చేశారని రైతులు ప్రశ్నించారు. సకాలంలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి సంచులు నింపి ఆయా రైస్‌మిల్లులకు గోదాములకు పంపితే రైతులకు ఈ కష్టం వచ్చేది కాదని, ఇదంతా ప్రభుత్వ నిర్లక్షమేనని రైతులు వాపోయారు. మొలచిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ధర్నాను ఉధృతంగా ఉద్యమంలో చేపడతామని రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఘటనా స్థలానికి ఏసిపి వెంకటేశ్వరరెడ్డి, పోలీసు బలగాలతో చేరుకొని, జిల్లా వ్యవసాయ కమిటీ అధికారులు, ఆర్డిఓ రాజాగౌడ్ చరవాణి ద్వారా మాట్లాడి రైతులు చేసిన ధర్నాను విషయాన్ని తెలుపగా ఉన్నతాధికారులు స్పందించి రెండు రోజుల్లో ధాన్యాన్ని మొత్తం బస్తాలలో నింపి ఆయా రైస్ మిల్ పంపిస్తానని పూర్తిగా హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News