- Advertisement -
ఎపికి చెందిన ఆర్మీ ఉద్యోగి అదృశ్యమయ్యారు. ఉత్తరాఖండ్ బేస్ క్యాంపులో పని చేసే కడప జిల్లా కలసపాడు మండలం ముదిరెడ్డిపల్లెకు చెందిన నాగార్జున రెడ్డి సెలవులపై స్వగ్రామానికి వెళ్లారు. అయితే సెలవులు ముగియడంతో తిరిగి గత నెల 1న తాను పని చేసే ఉత్తరాఖండ్‌కు బయల్దేరివెళ్లారు. కానీ తమ బేస్ క్యాంపునకు నాగార్జున రెడ్డి రాలేదని ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. దీంతో పోలీసులకు నాగార్జునరెడ్డి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాగార్జున రెడ్డి ఆచూకీ తెలయకపోవడం, ఫోన్ అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
- Advertisement -