- Advertisement -
జమ్మూ కాశ్మీర్‌లో మరో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం రాంబన్ జిల్లాలోని బ్యాటరీ చాష్మా సమీపంలో దాదాపు 700 అడుగుల లోతైన లోయలో ఆర్మీ వాహనం పడిపోవడంతో ముగ్గురు సైనికులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో జమ్మూ నుండి శ్రీనగర్‌కు NH 44 రహదారిపై వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, సైనికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో చనిపోయిన ముగ్గురు జవాన్ల మృతదేహాలను బయటకు తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -