Thursday, August 21, 2025

ప్రధాని పర్యటన.. యూత్‌ కాంగ్రెస్‌ నేతల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాని పర్యటన దృష్ట్యా మోత రోహిత్ ముందస్తుగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మోత రోహిత్ ను నల్లకుంట పోలీస్ స్టేషన్ కు తరలించారు. అటు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతరావు గృహనిర్భంధం చేశారు. సునీతరావు బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ప్రధాని పర్యటన నేపధ్యంలో యూత్‌ కాంగ్రెస్‌ నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. NSUI అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ ఎస్సీ సెల్‌ నేత ప్రీతంతో పాటు యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శివసేనారెడ్డి ఇతర కాంగ్రెస్‌ నేతలను హౌస్‌ అరెస్ట్ చేశారు. ప్రధాని పర్యటనను అడ్డుకుంటామని NSUI,యూత్‌ కాంగ్రెస్‌ నేతలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News