తమిళ హీరో జయం రవి, ఆర్తి విడాకుల కేసు మరోసారి తెరపైకి వచ్చింది. తనకు జయం రవి నుంచి నెలకు రూ.40 లక్షలు భరణం ఇప్పించాలని కోరుతూ ఆర్తి పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను జూన్ 12వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. జయం రవి కూడా తన మాజీ భార్య ఆర్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విడాకుల తర్వాత తన భార్య ఆర్తి తనను ఇంటి నుంచి గెంటివేసిందని, తన వస్తువులను తిరిగి ఇప్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
తన భార్య ఆర్తి నుంచి తాను విడిపోతున్నట్లు గతేడాది జయం రవి ప్రకటించిన సంగతి తెలిసిందే. తన భార్య నుంచి విడాకులు తీససుకుంటున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించారు. దీనిపై ఆర్తి స్పందిస్తూ.. తనకు చెప్పకుండానే రవి విడాకుల విషయం బయటపెట్టారంటూ ఆరోపించారు. మూడో వ్యక్తి వల్లనే తాము విడిపోయినట్లు ఆర్తి తెలిపింది. ఆ తర్వాత రవి.. గాయని కెనీషాతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కెనీషాతో రవి డేటింగ్ చేస్తున్నాడని.. అందుకే తన భార్య ఆర్తికి విడాకులు ఇచ్చాడని వార్తలు వచ్చాయి. అయితే, ఆ రూమర్స్ ను రవి ఖండించారు.