Wednesday, August 20, 2025

అరుణాచల్ పిసిసి అధ్యక్షుడి రాజీనామా

- Advertisement -
- Advertisement -

ఇటానగర్: త్వరలో లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో అరుణాచల్ మాజీ ముఖ్యమంత్రి నాబం టుకీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఎఐసిసి అధ్యక్షుడికి టుకీ తన రాజీనామా లేఖను శుక్రవారం పంపించినట్లు పార్టీ నాయకుడు ఒకరు శనివారం తెలిపారు. పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బిజెపిలోకి ఫిరాయించిన దరిమిలా టుకీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.

ఇతర రాజకీయ పార్టీలకు ఫిరాయిస్తున్న పార్టీ ఎమ్మెల్యేలను నిలువరించడంలో విఫలమైనందున నైతిక బాధ్యత వహిస్తూ టుకీ తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గ్యామర్ తనా తెలిపారు. రాష్ట్రంలోని సగలీ అసెంబ్లీ స్థానానికి టుకీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తూర్పు సియాంగ్ జిల్లాలోని మెబో నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడు లోంబో తాయెంగ్ ఈ నెల మొదట్లో బిజెపిలో చేరారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా బిజెపిలో చేరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News