Friday, May 2, 2025

ఆప్ కొత్త వ్యూహం.. పార్లమెంట్‌కి కేజ్రీవాల్..?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: గత ఏడాది జరిగి ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సిఎం కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా పలువురు సీనియర్లు నేతలు ఓటమి పాలయ్యారు. అయితే ఈ ఫలితాల తర్వాత కేజ్రివాల్ సైలెంట్ అయిపోతారని అంతా భావించారు. కానీ, ఆయన పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఇక ఆప్ ప్రతిపక్ష నేతగా మాజీ సిఎం అతిశీని ఎంపిక చేయడాన్ని కూడా ఆయన సమర్థించారు. అయితే ఇప్పుడు ఆయన మరో కీలక పదవి చేపట్టనున్నారని వార్తలు వస్తున్నాయి.

పంజాబ్ లూథియానా వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే గురుప్రీత్ గోగి గత నెలలో మృతి చెందారు. దీంతో రాజ్యసభ ఎంపి సంజీవ్ అరోరాను ఆ ఉప ఎన్నిక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆప్ ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సంజీవ్ అరోరా రాజ్యసభ పదవీకాలం 2028తో ముగియనుంది. దీంతో ఆయన్ని అసెంబ్లీకి పంపించి కేజ్రీవాల్‌ను రాజ్యసభకు పంపించాలని ఆప్ వ్యూహం రచిస్తున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మరి దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News