Friday, August 15, 2025

పాకిస్తాన్‌కు మరోసారి చురకలంటించిన అసదుద్దీన్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్‌పై(Pakistan ) విరుచుకుపడుతున్న ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin owaisi) తాజాగా మరోసారి పాక్‌కు చురకలంటించారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్, సైనిక చీఫ్ మునీర్లను ఉద్దేశించి ’ఎక్స్’ వేదికగా ఒవైసీ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘చైనా నుంచి అద్దెకు తెచ్చుకున్న విమానాన్ని పాకిస్థాన్ ప్రధానమంత్రి షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ తమ రహీమ్ యార్ ఖాన్‌ఎయిర్‌బేస్‌లో ల్యాండ్ చేయగలరా?‘ అని ప్రశ్నించారు. ఎందుకంటే ఆ ఎయిర్బేస్ ఇటీవల భారత్ చేసిన దాడుల్లో తీవ్రంగా ధ్వంసమైంది. తమ ఎయిర్ బేస్ లపై ఎలాంటి దాడి జరగలేదని ముందు బుకాయించిన పాక్ అనంతరం దాడులు నిజమేనని ఒప్పుకుంది. ఈ నేపథ్యంలోనే పాక్‌కు ఎద్దేవా చేస్తూ ఆయన ఈ ట్వీట్ చేశారు. దీనిపై ’ఎక్స్’ యూజర్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News