పహల్గాం దాడి తర్వాత పాక్‌తో క్రికెట్ మ్యాచ్ ఎలా ఆడుతారని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. మతాన్ని అడిగి మరీ 26 మందిని దారుణంగా కాల్చి చంపారని ఆయన గుర్తు చేశారు. ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్, భారత్ క్రికెట్ మ్యాచ్‌పై తీవ్రంగా స్పందించారు. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని చెప్పిన మోడీ మాటలను ఆయన గుర్తు చేశారు. క్రికెట్ మ్యాచ్ ఎలా జరుగుతుందో చెప్పాలని అసదుద్దీన్ ప్రధాని మోడీని నిలదీశారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయక పౌరులు మరణించిన నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని ప్రతిపక్షాలు, బాధిత కుటుంబాలు డిమాండ్ చేసున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ 26 మంది పౌరుల ప్రాణాల కంటే డబ్బే ఎక్కువ విలువైందా? అని నిలదీశారు. దీనికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్‌తో అన్ని సంబంధాలు తెంచుకున్నప్పుడు, నీటి ఒప్పందాలు కూడా రద్దు చేసుకున్నప్పుడు క్రికెట్ మ్యాచ్ మాత్రం ఎందుకు ఆడుతున్నారని ప్రశ్నించారు. పహల్గాం బాధితులకు మోడీ ఏం సమాధానం చెబుతారని అన్నారు.
Also Read: రేపటి నుంచి ప్రైవేట్ కాలేజీల నిరవధిక బంద్