Thursday, August 14, 2025

చిన్నప్పుడు స్నేహితులు… ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేయించిన సంఘటన కర్నాటక రాష్ట్రం వాయువ్య బెంగళూరులో జరిగింది. భార్యతో ప్రియుడ్ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… విజయ్, ధనంజయ్ అనే ఇద్దరూ ఆటో డ్రైవర్లు పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉన్నారు. విజయ్ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా చేయడంతో పాటు కమీషన్ తీసుకుని వ్యక్తులకు అద్దె ఇల్లు చూపించేవాడు. అతను పదేళ్ల క్రితం ఆశా అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ధనంజయ్ తరచుగా విజయ్ ఇంటికి వస్తుండడంతో ఆశాతో సన్నిహితంగా ఉన్నాడు.

చనువు అనేది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం విజయ్‌కు తెలియడంతో కుటుంబంతో కలిసి కమాక్షిపాలి నుంచి మచోహల్లికి మారిపోయారు. తన భార్యను ధనంజయ్‌ నుంచి దూరంగా ఉంచడానికి మకాం మార్చాడు. విజయ్ పలుమార్లు ఇద్దరిని హెచ్చరించినా కూడా పదే పదే కలుసుకునేవారు. దీంతో దంపతుల మధ్య గొడవలు తారా స్థాయికి చేరుకున్నాయి. భార్య తన ప్రియుడితో కలిసి హత్య చేయాలని నిర్ణయం తీసుకున్నారు. విజయ్ ఇంటి నుంచి 500 మీటర్ల దూరం ప్రయాణించిన తరువాత అతడిపై పదునైన ఆయుధాలతో దాడి చేశారు. రక్తపు మడుగులో ఉన్న విజయ్ ను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. మృతుడి స్వస్థలం మాగడిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News