ఆర్థిక ఇబ్బందులు ఆపై ఒంటరితనం కారణంగా ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడి తనువు చాలించిన విషాద ఘటన నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలంలో చోటుచేసుకుంది.వివరాలలోకి వెలళితే.. సదాశివనగర్ ఎస్సై పుష్పరాజ్ తెలిపిన కథనం ప్రకారం.. సదాశివనగర్ మండలం పద్మాజీవాడకు చెందిన మాదరి అంబిక (40) ఆశా వర్కర్. సోమవారం తన స్వగృహంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది . స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసి కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. కాగా మృతురాలు మ్యాదరి అంబిక ఆశా వర్కర్ గా విధులు నిర్వహిస్తూ జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. భర్త మరణించగా తన కూతురితో కలిసి ఉండేది . ఇటీవల తన కుమార్తెకు వివాహం చేసింది. ఆ తర్వాత అప్పుల భారం పెరిగింది. దానికి తోడు ఒంటరితనం కారణంగా బాధపడుతూ గత కొంతకాలంగా ఆత్మహత్య ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు .
బతుకు భారమై తనువు చాలించిన ఆశ వర్కర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -