- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ వ్యవస్ధాపక సభ్యుల్లో ఒకరైన పూసపాటి అశోక్ గజపతిరాజు శుక్రవారం ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో పాటు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు కూడా పంపించారు. ఈ మేరకు తన రాజీనామాను ఆమోదించాలని ఈ లేఖల్లో అశోక్ గజపతిరాజు పార్టీ అధిష్టానాన్ని కోరారు. తాజాగా గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజును కేంద్రం నియమించింది. దీంతో ఆయన త్వరలో బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీకి తప్పనిసరిగా రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అశోక్ తన రాజీనామాను అధికారికంగా సమర్పించారు.
- Advertisement -