Tuesday, May 20, 2025

ఆపరేషన్ సిందూర్‌పై వివాదాస్పద పోస్ట్.. ప్రొఫెసర్‌ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

ఆపరేషన్ సిందూర్‌పై వివాదాస్పద పోస్ట్ చేసిన అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్‌ను హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం సోనేపట్ కోర్టులో ప్రవేశపెట్టి ఏడు రోజుల రిమాండ్‌ను కోరగా.. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

ప్రొఫెసర్ అలీ ఖాన్ మహ్మదాబాద్‌.. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్‌లో భారత్ సైనిక చర్య, ఆపరేషన్ సిందూర్‌పై వివాదాస్పద పోస్ట్ చేశారు. ఆపరేషన్ సిందూర్ గురించి కల్నల్ ఖురేషి, వింగ్ కమాండర్ సింగ్ మీడియా సమావేశాలను ఉద్దేశిస్తూ.. “వంచన” అని అభివర్ణించారు. ఆయన సోషల్ మీడియా పోస్ట్ సాయుధ దళాలను, ఆపరేషన్ సిందూర్‌పై మీడియా సమావేశాలకు ప్రధాన ప్రతినిధిగా ఉన్న మహిళా అధికారులు, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లను విమర్శించేదిగా, అగౌరవపరిచేదిగా ఉందని హర్యానాలోని బిజెపి యువ మోర్చా ప్రధాన కార్యదర్శి యోగేష్ జతేరి ఫిర్యాదు మేరకు అరెస్టు చేశారు. హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ కూడా ప్రత్యేక కేసు దాఖలు చేసింది. అయితే, ప్రొఫెసర్ తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, కేవలం తన రాజ్యాంగ స్వేచ్ఛా హక్కును ఉపయోగించుకుంటున్నానని మహ్మదాబాద్ చెప్పాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News