Wednesday, August 20, 2025

Asia Cup 2025: భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?

- Advertisement -
- Advertisement -

వైస్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్
బుమ్రాకు చోటు, యశస్వి, సుదర్శన్‌లకు నో ఛాన్స్
ఆసియా కప్ కోసం టీమిండియా ఎంపిక
ముంబై: ప్రతిష్ఠాత్మకమైన ఆసియాకప్ టి20 టోర్నమెంట్‌లో పాల్గొనే టీమిండియాను మంగళవారం సెలెక్టర్లు ఎంపిక చేశారు. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) వేదికగా ఆసియా కప్ జరుగనుంది. ఈ టోర్నీలో భారత్‌తో సహా 8 జట్లు పోటీ పడనున్నాయి. టోర్నమెంట్‌లో పాల్గొనే జట్లను ఎ, బి గ్రూపులుగా విభజించారు. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్‌లు ఒకే గ్రూపులోఉన్నాయి. భారత్, పాకిస్థాన్, ఒమన్, యుఎఇలు గ్రూప్‌ఎలో ఉన్నాయి. గ్రూప్‌బిలో బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, హాంకాంగ్, శ్రీలంకలు పోటీ పడనున్నాయి. అఫ్గానిస్థాన్, హాంకాంగ్ జట్ల మధ్య సెప్టెంబర్ 9న జరిగే గ్రూప్‌బి మ్యాచ్‌తో టోర్నమెంట్‌కు తెరలేవనుంది. భారత్ తన మొదటి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యుఎఇతో ఆడుతుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో సెప్టెంబర్ 14న తలపడుతుంది. చివరి లీగ్ మ్యాచ్‌లో సెప్టెంబర్ 19న ఒమన్‌ను ఎదుర్కొంటోంది. కాగా, టోర్నమెంట్ కోసం 15 మందితో కూడిన టీమ్‌ను సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. మంగళవారం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలో సమావేశమైన కమిటీ జట్టును ఎంపిక చేసింది. ఊహించినట్టే సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అయితే అనూహ్యంగా శుభ్‌మన్ గిల్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

హార్దిక్ పాండ్య జట్టులో ఉన్నా అతన్ని కాదని గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయడం విశేషం. మరోవైపు సీనియర్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రా కూడా ఆసియాకప్ జట్టులో చోటు సంపాదించాడు. బుమ్రాను ఎంపిక చేస్తారని ఎవరూ ఊహించలేదు. అందరి అంచనాలను తారుమారు చేస్తూ సెలెక్టర్ బుమ్రాను జట్టుకు ఎంపిక చేయడం గమనార్హం. సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, శివమ్ దూబె తదితరులు జట్టులో చోటు సంపాదించారు. రెండో వికెట్ కీపర్‌గా జితేశ్ శర్మను జట్టులోకి తీసుకున్నారు. హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్‌లకుకూడా జట్టులో చోటు దక్కింది. కాగా, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్‌లు స్టాండ్‌బైగా ఎంపికయ్యారు.

జట్టు వివరాలు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకూ సింగ్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, జస్‌ప్రిత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News