Tuesday, September 9, 2025

మెగా టోర్నీకి సర్వం సిద్ధం.. నేటి నుంచి ఆసియా కప్

- Advertisement -
- Advertisement -

తొలి మ్యాచ్‌లో హాంకాంగ్‌తో అఫ్గాన్ ఢీ
అబుదాబి: ప్రతిష్ఠాత్మకమైన ఆసియా కప్ టి20 టోర్నమెంట్‌కు సర్వం సిద్ధమైంది. యుఎఇ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీకి మంగళవారం తెరలేవనుంది. ఆసియాకప్‌లో మొత్తం 8 జట్లు పోటీ పడుతున్నాయి. మంగళవారం జరిగే ఆరంభ మ్యాచ్లో హాంకాంగ్‌తో అఫ్గానిస్థాన్ తలపడనుంది. ఈ టోర్నీలో పాల్గొనే జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌ఎలో భారత్‌తో పాటు పాకిస్థాన్, ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) జట్లు ఉన్నాయి. గ్రూప్‌బిలో అఫ్గానిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, హాంకాంగ్ జట్లకు చోటు కల్పించారు.

మంగళవారం ప్రారంభమయ్యే ఆసియాకప్ సెప్టెంబర్ 28న జరిగేఫైనల్‌తో ముగుస్తోంది. చిరకాల ప్రత్యర్థులు పాకిస్థాన్, భారత్ జట్ల మధ్య సెప్టెంబర్ 14న దుబాయి వేదికగా పోరు జరుగనుంది. భారత్ తన ఆరంభ మ్యాచ్‌ను బుధవారం యుఎఇతో ఆడుతుంది. చివరి లీగ్ మ్యాచ్‌లో19న ఒమన్‌ను ఎదుర్కొంటోంది. ఇక లీగ్ దశలో ప్రతి గ్రూప్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సూపర్4 అర్హత సాధిస్తాయి. ఈ దశలో అగ్రస్థానంలో నిలిచే రెండు జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి. అన్ని మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News