Wednesday, September 10, 2025

ఆసియా కప్ 2025: మరికాసేపట్లో భారత్-యుఎఇ పోరు..

- Advertisement -
- Advertisement -

దుబాయ్: ఆసియా కప్ 2025లో భాగంగా రెండవ మ్యాచ్‌లో టీమిండియా, (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)యుఎఇ జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈరోజు(సెప్టెంబర్ 10, బుధవారం) రాత్రి 8 గంటలకు భారత్-యుఎఇ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. గ్రూప్‌ ఏలో జరగనున్న తొలి మ్యాచ్‌ ఇదే.  2016 తర్వాత తొలిసారిగా ఈ ఫార్మాట్‌లో ఇరుజట్లు పోటీ పడుతున్నాయి. 2022లో టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకోలేకపోయినా.. 2023లో వన్డే ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్ ను గెలుచుకుంది. ఈసారి భారత్.. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ఆసియా కప్ బరిలో దిగుతోంది. టైటిల్ సాధించడమే లక్ష్యంగా టీమిండియా వేట ప్రారంభించనుంది. మరోవైపు, యుఎఇ జట్టు కూడా గతంలో కంటే మెరుగ్గా రాణిస్తోంది. ఇటీవల జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో యుఎఇ, బంగ్లాదేశ్‌ను ఓడించి సత్తా చాటింది. తర్వాత పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లతో జరిగిన ట్రై-సిరీస్‌లో ఒక్క ఆట కూడా గెలవలేకపోయినప్పటికీ.. ధీటైన పోటీ ఇచ్చారు. ఆసియా కప్ లో మళ్లీ సత్తా చాటాలని యుఎఇ జట్టు పట్టుదలగా ఉంది.

జట్ల వివరాలు..

టీమిండియా: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, జితేష్ శర్మ(w), అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, సంజు శాంసన్, రింకు సింగ్, శివమ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఎఇ): ముహమ్మద్ వసీమ్(సి), అలీషాన్ షరాఫు, రాహుల్ చోప్రా(డబ్ల్యూ), ఆసిఫ్ ఖాన్, ముహమ్మద్ జోహైబ్, హర్షిత్ కౌశిక్, ముహమ్మద్ ఫరూఖ్, ముహమ్మద్ జవదుల్లా, సగీర్ ఖాన్, హైదర్ అలీ, జునైద్ సిద్ధిఖ్, ముహమ్మద్ రోహిద్ ఖాన్, ఆర్యన్ష్ శర్మ, ధ్రువ్ పరాశర్, మతివుల్లా సింగ్, సిమ్రాన్‌జీత్‌సౌ ఖాన్, సిమ్రాన్‌జీత్‌సౌ ఖాన్, ఇథాన్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News