- Advertisement -
దుబాయ్: ఆసియా కప్ 2025లో భాగంగా రెండవ మ్యాచ్‌లో టీమిండియా, (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)యుఎఇ జట్లు తలపడుతున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుగా యుఎఇ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. టీమిండియాను ఓడించి టోర్నీలో బోణీ కొట్టాలని యుఎఇ జట్టు తహతహలాడుతోంది.
జట్ల వివరాలు..
టీమిండియా: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(సి), తిలక్ వర్మ, సంజు శాంసన్(w), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చకరవర్తి
యుఎఇ: ముహమ్మద్ వసీమ్(సి), అలీషాన్ షరాఫు, ముహమ్మద్ జోహైబ్, రాహుల్ చోప్రా(w), ఆసిఫ్ ఖాన్, హర్షిత్ కౌశిక్, హైదర్ అలీ, ధ్రువ్ పరాశర్, ముహమ్మద్ రోహిద్ ఖాన్, జునైద్ సిద్ధిక్, సిమ్రంజీత్ సింగ్
- Advertisement -