Sunday, September 14, 2025

ఆసియా కప్ 2025: చివర్లో రెచ్చిపోయిన షహీన్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

- Advertisement -
- Advertisement -

ఆసియా కప్ 2025లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు స్వల్ప స్కోరు సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ కోల్పోయిన పాకిస్తాన్.. భారత బౌలర్ల దెబ్బకు కోలుకోలేకపోయింది. మరోసారి కుల్దీప్ యాదవ్ చెలరేగాడు. వరుస వికెట్లతో పాక్ జట్టును దెబ్బ కొట్టాడు. పాక్ బ్యాట్స్ మెన్లలో సాహిబ్‌జాదా ఫర్హాన్(40) రాణించగా.. చివర్లలో బౌలర్ షహీన్ ఆఫ్రీది సిక్సులతో రెచ్చిపోయాడు. కేవలం 16 బంతుల్లో నాలుగు సిక్సులతో అజేయంగా 33 పరుగులు చేశాడు. దీంతో పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. దీంతో పాక్, భారత్ జట్టుకు 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఇక, భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు.. బుమ్రా, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలు ఒక్కో వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News