హైదరాబాద్ : తెలంగాణ గొప్పతనం తెలుసుకోవాలంటే గూగుల్‌ను అడగాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎక్కడ ఉంది? ప్రపంచంలోనే అతి పెద్ద ఇంక్యూబేటర్ ఎక్కడ ఉంది? అని కెటిఆర్ ప్రశ్నించారు. ఈ రెండు తెలంగాణలోనే ఉండటం, వీటిని కెసిఆర్ ప్రభుత్వమే నిర్మించడం గర్వకారణంగా ఉందని కెటిఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. వ్యవసాయం నుంచి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వరకు అన్ని రంగాల్లో అగ్రభాగాన ఉన్నామని కెటిఆర్ స్పష్టపర్చారు.
Ask Google about the versatility of Telangana
Where is the World’s Largest Lift Irrigation Project?
Where is the World’s Largest Incubator?
Matter of great pride that both are in #Telangana & both built by #KCR Govt
Agriculture to ICT; we cover all bases
pic.twitter.com/KaUbx5RBaL
— KTR (@KTRTRS) June 30, 2022