మేషం – కళా, సాహిత్య రంగాల్లో ఉన్న వారికి కొన్ని అవార్డులు లభించే సూచనలు ఉన్నాయి. పెద్దలు ఉన్నత స్థానంలోని వారి సలహాలను సంప్రదింపులను పాటిస్తారు. సంతానం మంచి స్థితిని సాధిస్తారు.
వృషభం – కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మీ గురించి చెడుగా ప్రచారం చేసే వారితో వాదించడం కన్నా వారికి దూరంగా ఉండటం మంచిదని భావిస్తారు. అదేవిధంగా మీ వ్యవహారశైలి ఉంటుంది.
మిథునం – వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మీ స్థాయి గౌరవం పెంపొందుతాయి. ఉన్నత విద్యను అభ్యసించాలనే మీ కోరిక నెరవేరుతుంది. దూర దృష్టితో వ్యవహరిస్తారు.
కర్కాటకం – లౌక్యంగా వ్యవహరిస్తారు. కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన అంశాలు లాభిస్తాయి. నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. తొందరపాటుకు ఏమాత్రం అవకాశం కల్పించరు.
సింహం – అనుకున్న పనులు కొంత జాప్యం మీద పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధిని పొందుతారు. ఇన్కమ్ టాక్స్ సేల్ టాక్స్ వంటి వాటి చెల్లింపు విషయంలో జాగ్రత్తలు పాటించండి.
కన్య – సంఘంలో మీకు గౌరవం లభిస్తుంది. చిరకాలపు కోరిక నెరవేరుతుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. సన్నిహితుల సహాయంతో ముందుకు సాగుతారు.
తుల – వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. రాజకీయ కళారంగాల వారికి సన్మానయోగం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
వృశ్చికం – క్రయవిక్రయాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. స్త్రీలతో విభేదాలు ఏర్పడకుండా తగిన జాగ్రత్త వహించండి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.
ధనుస్సు – వైరాన్ని ప్రదర్శిస్తున్న వారికి తగు సమాధానాలు చెప్పగలుగుతారు. కీలకమని భావించిన వ్యవహారాలు సానుకూల పరుచుకోవడానికి గాను మీరు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
మకరం – ఆర్థిక పరిస్థితి కొంత వరకు మెరుగ్గానే ఉంటుంది. పనిముట్లు, ఎలక్ట్రానిక్ సామాగ్రి మరియు ఇతరులకు సంబంధించి మీ వద్ద ఉన్న వస్తు భద్రత పట్ల జాగ్రత్తలు వహించండి.
కుంభం – బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయ సందర్శనం చేసుకుంటారు. కళా రంగంలోని వారికి విదేశీ పర్యటనల సూచన.
మీనం – ఆర్థిక సమస్యలు చికాకు కలిగిస్తాయి. రుణాలు కొంతవరకు తీరుతాయి. కోపతాపాలకు దూరంగా ఉండండి. జీవిత భాగస్వామి సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.