మన తెలంగాణ/హైదరాబాద్ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో ’ఎట్ హోం’ కార్యక్రమం జరిగింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తేనీటి విందుకు సిఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన వారి వద్దకు వెళ్లి గవర్నర్, సిఎం పలకరిం చారు. ఏటా స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రంలోని ప్రముఖులను గవర్నర్ రాజ్‌భవన్‌కు ఆహ్వానించి తేనీటి విందు ఇవ్వడం ఆన వాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు, ప్రముఖులు రాజ్‌భవన్‌కు వచ్చారు. వీరందరికి తగిన ఏర్పాట్లు చేశారు. రాజ కీయ నేతలు రానున్న నేపథ్యంలో రాజ్‌భవన్ దారిలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్‌భవన్‌లో జాతీయ పతాకావిష్కరణ చేశారు. ప్రజలందరికి 79వ స్వాతంత్య్ర దినోత్సవ శుభా కాంక్షలు తెలిపారు.
రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం.. హాజరైన సిఎం రేవంత్
- Advertisement -
- Advertisement -
- Advertisement -