- Advertisement -
అమరావతి: కూటమి ప్రభుత్వం ముందుగానే యూరియా సరఫరా చేసి కొరతకు తెరదించిందని ఎపి వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వైసిపి హయాంలో యూరియా కోసం రైతులు అవస్థలు పడ్డారని అన్నారు. అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. సిఎం చంద్రబాబు నాయుడు చొరవ వల్ల అదనంగా 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి రానుందని, రైతులకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచుతున్నామని తెలియజేశారు. ఎక్కడా యూరియా సమస్య లేదని, వైసిపి కావాలని రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. రబీకి 9.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం కేటాయించిందని, రూ. 130 కోట్లు ఖర్చు చేసి 7.37 లక్షల మందికి రాయితీతో విత్తనాలు అందించామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
Also Read : వైసిపికి రాయలసీమ ప్రాంతంలో ఉనికి కూడా లేదు: పయ్యావుల
- Advertisement -